Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత కుటుంబానికి అండగా ఉంటా: ఎమ్మెల్యే

Follow Udayam on Google
anji kummari Sep 10, 2026 3:35 PM మహబూబ్‌నగర్General
బాధిత కుటుంబానికి అండగా ఉంటా: ఎమ్మెల్యే - Udayam
రాజాపూర్ మండలంలోని చేన్నవెళ్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు రమేష్ రెడ్డి మృతి పట్ల జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం వారి స్వగ్రామంలో రమేష్ రెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే, దుష్యంత్ రెడ్డి ఆయన పాడె మోసి అంతిమయాత్రలో పాల్గొని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Comments

G
Loading comments...