Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాడంగిని కరవు మండలంగా ప్రకటించాలి

Follow Udayam on Google
B. Rajesh Oct 06, 2026 5:56 PM విజయనగరంGeneral
బాడంగి మండలాన్ని కరవు మండలంగా ప్రకటించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.గోపాలం డిమాండ్ చేశారు. కరవు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, మొక్కజొన్న, చెరకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. పంటలు లేక రైతులు, కూలీలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...