Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టైపెండ్ పెంపు కోసం ఆయుర్వేద హౌస్ సర్జన్ల నిరసన

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 30, 2026 5:01 PM వరంగల్General
స్టైపెండ్ పెంపు కోసం ఆయుర్వేద హౌస్ సర్జన్ల నిరసన - Udayam
స్టైపెండ్ పెంపు డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల హౌస్ సర్జన్లు గురువారం నిరసన చేపట్టారు. వరంగల్‌లోని అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాలలో తెలంగాణ ఆయుష్ జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించారు. అల్లోపతి హౌస్ సర్జన్లతో సమానంగా స్టైపెండ్ పెంచాలని, బకాయిలు విడుదల చేసి ప్రతి నెలా స్టైపెండ్ చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...