వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్య రామ మందిర విరాళాల వ్యవహారంలో శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే భారతీయ జనతా పార్టీ (BJP)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో దోచుకుంటున్నవారే అధికారంలో ఉన్నారంటూ ఆయన మండిపడ్డారు. ముంబయిలో నిర్వహించిన ‘రామ రక్ష’ ఆందోళన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అయోధ్య కేవలం ఒక ట్రైలర్ మాత్రమేనని, కాశీ, మథురలు ఇంకా మిగిలే ఉన్నాయని.. అక్కడ జరగబోయే దోపిడీ గురించి తనకు ఆందోళనగా ఉందని ఉద్ధవ్ పేర్కొన్నారు. "మేం ధైర్యవంతులం, దేశభక్తి కలిగిన హిందువులం.. కానీ మూర్ఖులం మాత్రం కాదు" అని స్పష్టం చేస్తూ భాజపా రాజకీయాలపై ధ్వజమెత్తారు.
Comments
Loading comments...

