Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేటకు వెళ్లిన మత్స్యకారులు

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 05, 2026 6:07 AM జాతీయంGeneral
వేటకు వెళ్లిన మత్స్యకారులు - Udayam
ఈ నెల 1న విశాఖ చేపలరేవు నుంచి బోటులో వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల సముద్రం అల్లకల్లోలంగా మారడంతో శనివారం సాయంత్రం కల్లా తీరానికి రావాల్సిన వారు రాకపోవడంతో ఆందోళన మొదలైంది. గల్లంతైన వారిలో భోగాపురం మండలం ముక్కాంకు చెందిన ఐదుగురు, భీమిలికి చెందిన ఇద్దరు ఉన్నారు. వారి ఫోన్లు పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతుండగా, ఈ విషయాన్ని మత్స్యశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు జానకిరామ్‌ తెలిపారు.

Comments

G
Loading comments...