వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ బీసీ కాలనీ సమీపంలో శనివారం పాసింజర్ ఆటో బోల్తాపడింది. పర్వతగిరి నుంచి మహబూబాబాద్ వస్తున్న ఆటో.. ముందుగా వెళ్తున్న బైకును తప్పించబోయి అదుపుతప్పి బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

