వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల బాయ్స్ హాస్టల్ మెస్‌లో వడ్డించిన గుడ్డు కూర నుంచి దుర్వాసన రావడంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నాణ్యమైన భోజనం అందడం లేదని వారు ఆరోపించారు.
మెస్‌లోని ఆహారాన్ని తీసుకెళ్లి పరిపాలనా భవనం వద్ద నిరసన తెలిపారు. ప్రిన్సిపల్, వార్డెన్ స్పందించి నాసిరకం ఆహారం తయారీలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Comments
Loading comments...

