వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం ఏజెన్సీ ప్రాంతాల్లో లభించే అటవీ ఉత్పత్తుల కొనుగోలుపై గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నట్లు GCC మేనేజర్ సాంబశివరావు తెలిపారు. పార్వతీపురం బ్రాంచ్ పరిధిలోని కెమిశీల GCC డిపో వద్ద గిరిజనులకు అటవీ ఉత్పత్తుల సేకరణ, కొనుగోలుపై అవగాహన కల్పించారు.
గిరిజనులు సేకరించిన ఉత్పత్తులను నేరుగా GCC డిపోల ద్వారా విక్రయిస్తే, వారికి చెల్లించాల్సిన నగదు నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతుందని ఆయన వివరించారు.
Comments
Loading comments...

