వార్తలకు తిరిగి వెళ్లండి

బీహార్‌లో ప్రముఖ ఎడ్యుకేటర్ ఫైసల్ ఖాన్‌కు చెందిన 'ఖాన్ గ్లోబల్ స్టడీస్' కోచింగ్ సెంటర్‌పై మంగళవారం రాత్రి సుమారు 20 మంది దుండగులు రాళ్లతో దాడి చేసి విధ్వంసం సృష్టించారు. తక్కువ ఫీజుతో తమ విద్యార్థులు సాధిస్తున్న విజయాలను ఓర్వలేకనే ప్రత్యర్థి కోచింగ్ సెంటర్లు ఈ దాడికి పాల్పడ్డాయని ఖాన్ సార్ ఆరోపించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కదమ్‌కువాన్ పోలీసులు ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. కాల్పులు జరిగాయనే ప్రచారంపై స్పష్టత లేదని, నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేశామని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

