Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చాకుతో కానిస్టేబుల్‌పై దాడి.. పరారీలో దుండగుల

Follow Udayam on Google
Udayam Desk Aug 31, 2026 2:23 PM తూర్పుగోదావరి General
చాకుతో కానిస్టేబుల్‌పై దాడి.. పరారీలో దుండగుల  - Udayam
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం జాతీయ రహదారిపై హైవే కానిస్టేబుల్‌ వెంకటేశ్వరరావుపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. అనుమానాస్పదంగా ఉన్న నలుగురు యువకులను ప్రశ్నించేందుకు వెళ్లగా ఇద్దరు పరారయ్యారు. మరో ఇద్దరు బైక్‌ తాళానికి ఉన్న చాకుతో కానిస్టేబుల్‌ పొట్టపై రెండుసార్లు పొడిచి పారిపోయారు. గాయపడిన ఆయనను రాజమహేంద్రవరంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...