వార్తలకు తిరిగి వెళ్లండి

విధి నిర్వహణలో ఉన్న నార్సింగ్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రాజ్యలక్ష్మిపై దాడికి పాల్పడిన శ్రీరామ్ అనే వ్యక్తికి రాజేంద్రనగర్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, రూ. 500 జరిమానా విధించింది. 2024లో నిందితుడు ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించాడు.
డబ్బుల విషయంలో కక్ష పెంచుకున్న నిందితుడు గతంలోనూ దాడికి యత్నించినట్లు విచారణలో తేలింది. సాక్ష్యాలను పరిశీలించిన జడ్జి అన్నపూర్ణాదేవి నిందితుడికి శిక్ష ఖరారు చేస్తూ గురువారం తీర్పునిచ్చారు.
Comments
Loading comments...

