వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి జాతరలో భక్తులపై తేనెటీగలు దాడి చేశాయి. బోనాల కోసం వెలిగించిన కట్టెల పొయ్యిల పొగకు రెచ్చిపోయిన తేనెటీగలు భక్తులపై దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు.
క్షతగాత్రులను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఆలయ పరిసరాల్లోని తేనెటీగల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

