Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆశా కార్యకర్తలకు రూ.18 వేల వేతనం కల్పించాలి

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 12:12 PM సూర్యాపేటGeneral
ఆశా కార్యకర్తలకు రూ.18 వేల వేతనం కల్పించాలి - Udayam
తుంగతుర్తిలో అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో ఆశా కార్యకర్తలను పోలీసులు మంగళవారం ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆశా కార్యకర్తల సంఘం మండల అధ్యక్షురాలు మేకల జయమ్మ డిమాండ్ చేశారు. రూ.18 వేల వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఏఎంసీ టార్గెట్లను ఎత్తివేయాలని ఆమె కోరారు. చాలీచాలని వేతనాలతో కుటుంబ పోషణ భారంగా మారిందని తెలిపారు.

Comments

G
Loading comments...