Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసైన్డ్‌ భూమిలో అక్రమ మట్టి తవ్వకాలు

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 4:33 PM ఖమ్మంGeneral
అసైన్డ్‌ భూమిలో అక్రమ మట్టి తవ్వకాలు - Udayam
కొణిజర్ల మండలం పెద్దగోపతి రెవెన్యూ పరిధిలోని అసైన్డ్‌ భూమిలో అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. పొక్లెయిన్లతో తవ్వి ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోజూ వంద నుంచి 150 ట్రక్కుల వరకు మట్టి తరలిస్తున్నట్లు చెబుతున్నారు. మైనింగ్‌, రెవెన్యూ అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...