వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ బి.శ్రీనివాసరావు హెచ్చరించారు. ఎస్పీ జగదీష్ ఆదేశాలతో 180 మంది పోలీసులతో రౌడీషీటర్లు, అనుమానితుల ఇళ్లు, ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
ఎన్నికల నేపథ్యంలో అసాంఘిక శక్తులపై నిఘా కొనసాగిస్తామని తెలిపారు. గంజాయి, మట్కా, జూదం, అక్రమ ఆయుధాలపై కేసులు నమోదు చేస్తామని, అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

