Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్ నిఘా

Follow Udayam on Google
K Anuradha Sep 22, 2026 11:30 AM శ్రీకాకుళంGeneral
అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్ నిఘా - Udayam
కాశీబుగ్గ–పలాస జంట నగరాల్లో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు డ్రోన్‌ నిఘా ముమ్మరం చేశారు. శివారు, నిర్మానుష్య ప్రాంతాలు, పాడుబడిన ఇళ్లపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోందని డీఎస్పీ టి. భవాని తెలిపారు. పేకాట, జూదం, గంజాయి, ఈవ్‌టీజింగ్‌ తదితర నేర కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ టి భవాని హెచ్చరించారు.

Comments

G
Loading comments...