వార్తలకు తిరిగి వెళ్లండి

పాడేరు, అరకు లోయ ప్రాంతాల్లో వర్షాలు లేక వరి పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. పాడేరు మండలం అయినాడ పంచాయతీ సికాయపాడు తదితర గ్రామాల్లో సాగునీరు అందక పైర్లు వాడిపోతున్నాయి.
పొలాలకు నీరు అందక తీవ్ర ఆందోళనకు గురవుతున్నామని రైతులు బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. పంటలను కాపాడేందుకు సాగునీరు అందించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

