Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టైఫండ్‌ పెంచాల్సిందే: జూడాల వినూత్న నిరసన

Follow Udayam on Google
vihar Aug 22, 2026 10:09 AM గుంటూరుGeneral
స్టైఫండ్‌ పెంచాల్సిందే: జూడాల వినూత్న నిరసన - Udayam
స్టైపెండ్‌ 30 శాతం పెంచాలని డిమాండ్‌ చేస్తూ నగర ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యులు వినూత్నంగా నిరసన తెలిపారు. వారి ఆందోళనలు శుక్రవారం 12వ రోజుకు చేరాయి. రాత్రి మొబైల్‌ ఫ్లాష్‌ లైట్లతో ‘3×30’ ఆకృతిలో నిలబడి నిరసన తెలిపారు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 3 శాతం పెంపు వద్దని, 30 శాతం పెంచాలని జూడా రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్‌ శంకర్‌ కోరారు.

Comments

G
Loading comments...