Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NMMS స్కాలర్‌షిప్‌కు 141 మంది విద్యార్థులు అర్హత

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 12, 2026 5:29 PM కోనసీమGeneral
NMMS స్కాలర్‌షిప్‌కు 141 మంది విద్యార్థులు అర్హత - Udayam
జిల్లా నుంచి నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (NMMS)కు 141 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు డీఈఓ డాక్టర్‌ షేక్‌ మహబూబ్‌ బాషా తెలిపారు. 2025 డిసెంబరులో 8వ తరగతి చదివిన విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారని చెప్పారు. మండపేట నుంచి 21, అల్లవరం 16, అమలాపురం 14 మంది ఎంపికయ్యారని తెలిపారు. ఎంపికైన విద్యార్థులు NSP పోర్టల్‌లో స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...