వార్తలకు తిరిగి వెళ్లండి

ఘట్‌కేసర్ ద్వారకానగర్‌లో మద్యం మత్తు, అనుమానంతో భర్త కట్రావత్ రాజు భార్య మాధవి (37)ని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి నిద్రిస్తున్న ఆమె ఛాతిపై సిమెంట్ ఇటుకతో కొట్టినట్లు పేర్కొన్నారు.
18 ఏళ్ల క్రితం వివాహమైన దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మూడేళ్లుగా మద్యానికి బానిసైన రాజు అనుమానంతో భార్యను వేధించేవాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

