Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దారిదోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్

Follow Udayam on Google
జయ Aug 17, 2026 5:00 PM ఆదిలాబాద్General
దారిదోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్ - Udayam
ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం ఖండాల ఘాట్‌ వద్ద వ్యక్తిపై దాడి చేసి రూ.50 వేల నగదుతో పరారైన నిందితుడిని అరెస్టు చేసినట్లు రూరల్‌ సీఐ రహీం పాషా తెలిపారు. మర్సకోల కృష్ణ వ్యవసాయ సామగ్రి కొనుగోలుకు నగదుతో వెళ్తుండగా ఘటన జరిగింది. పరిచయస్తుడైన మడావి లక్ష్మణ్‌ లిఫ్ట్‌ అడిగి మార్గమధ్యలో కృష్ణపై దాడి చేసి నగదుతో పరారైనట్లు సీఐ రహీం పాషా తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం నిందితుడిని అరెస్టు చేశారు.

Comments

G
Loading comments...