Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరుస చోరీలకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 14, 2026 11:17 AM తిరుపతిGeneral
వరుస చోరీలకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్ - Udayam
తిరుమలలో వరుస చోరీలకు పాల్పడుతున్న పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రుద్ర శ్యామ్ బాబు (49)ను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో రాంభగీచ పార్కింగ్ ఏరియాలో తనిఖీలు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. కార్ల అద్దాలు పగులగొట్టి నగదు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్ బ్యాగులు, ఇతర విలువైన వస్తువులు చోరీ చేసినట్లు నిర్ధారించారు. అతని నుంచి ఐఫోన్లు, యాపిల్ వాచ్, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...