వార్తలకు తిరిగి వెళ్లండి

అరకులోయ మండలం యండపల్లివలస టీచర్స్ కాలనీ వద్ద ఎస్‌ఐ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం వాహన తనిఖీలు నిర్వహించారు. పత్రాలు లేని వాహనదారులకు జరిమానాలు విధించారు.
డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్ పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. హెల్మెట్ ధరించకపోవడం, ట్రిపుల్ రైడింగ్‌పై కూడా చర్యలు తీసుకున్నారు. తనిఖీల్లో హెచ్‌సీ ప్రసాద్, ఏపీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

