వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్ఎస్ఎస్ డే సందర్భంగా అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ‘పచ్చని ఊరు–స్వచ్ఛమైన భారతం’ అంశంపై చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ సి.హెచ్. కేశవరావు ఆదేశాల మేరకు జరిగిన ఈ పోటీల్లో 12 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
పోటీల్లో విజేతలకు ఈనెల 24న నిర్వహించే ఎన్ఎస్ఎస్ డే కార్యక్రమంలో బహుమతులు అందజేయనున్నట్లు ఎన్ఎస్ఎస్ పీఓలు వై. విజయలక్ష్మి, బి. లచ్చన్న తెలిపారు.
Comments
Loading comments...

