వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లాలో అర్హులైన చేనేత కార్మికులకు నేతన్న సేవా పథకం వర్తింపజేయాలని ఏపీ చేనేత ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పీఏ హరీష్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు వెంకటనారాయణ, జేవీ రమణ తదితరులు మాట్లాడారు. అర్హులైన ప్రతి కార్మికుడికి రూ.25 వేల సాయం అందించాలని కోరారు. స్పందించిన హరీష్, ఈ నెలాఖరులోపు పథకం వర్తించేలా మంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
Comments
Loading comments...

