వార్తలకు తిరిగి వెళ్లండి

మార్చి త్రైమాసికంలో అపోలో హాస్పిటల్స్ రూ.6,605.5 కోట్ల ఆదాయంతో రూ.551.3 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే ఆదాయం 18%, లాభం 33% పెరిగాయి. ఒక్కో షేరుకు రూ.10 డివిడెండ్ ప్రకటించారు.
మరోవైపు, అపోలో నార్త్‌ను మాతృ సంస్థలో విలీనం చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. మాతాశిశు సంరక్షణ బలోపేతం కోసం క్లౌడ్‌నైన్ సంస్థలో 9.9% ఈక్విటీ వాటాను దక్కించుకుంటూ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది.
Comments
Loading comments...

