APMDC IPOకు వచ్చే ఏడాది డిసెంబర్ లక్ష్యం: చంద్రబాబు

మైనింగ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కొత్త ఖనిజ నిక్షేపాల గుర్తింపు, వినియోగంపై చర్చించి, APMDCని అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
ఖనిజ వనరులను భవిష్యత్ ఆస్తులుగా మార్చాలని చంద్రబాబు అన్నారు. APMDCని స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేసేందుకు వచ్చే ఏడాది డిసెంబర్‌ను లక్ష్యంగా పెట్టుకుని IPO కార్యాచరణ చేపట్టాలని తెలిపారు.
Comments
Loading comments...
