వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్ (APL) 5వ సీజన్ షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ACA) విడుదల చేసింది. ఈసారి విశాఖపట్నం, కడప, మంగళగిరి వేదికలుగా జూన్ 9 నుండి 30 వరకు మొత్తం 32 డే అండ్ నైట్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
కొత్త ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ మ్యాచ్‌లన్నింటినీ జియో సినిమా, హాట్‌స్టార్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. జూన్ 9–14 వరకు విశాఖలో, 17–21 వరకు కడపలో, 24–30 వరకు మంగళగిరిలో మ్యాచ్‌లు జరుగుతాయని ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని తెలిపారు.
Comments
Loading comments...

