వార్తలకు తిరిగి వెళ్లండి
ఖమ్మంలో మాదకద్రవ్యాల వ్యతిరేక ర్యాలీ
స్వాతి రెడ్డి Jun 26, 2026 9:10 AM ఖమ్మం 1 viewsabout 3 hours ago

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ దివాకర్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఈ ర్యాలీని ప్రారంభించి, గంజాయి రహిత సమాజం కోసం యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల విక్రయాల గురించి సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...