వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో 16,347 పోస్టుల మెగా డీఎస్సీని అత్యంత పారదర్శకంగా నిర్వహించామని, ప్రశ్నపత్రం లీకేజీకి ఎక్కడా అవకాశం లేదని విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్ స్పష్టం చేశారు. త్వరలోనే రాష్ట్రంలో మరో డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు ఆయన కీలక ప్రకటన చేశారు.
కొత్త నోటిఫికేషన్‌లోనూ హారిజాంటల్ రిజర్వేషన్ విధానమే ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే, మెగా డీఎస్సీలో ఫస్ట్ ర్యాంకర్ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకాలేదని, రాని పక్షంలో ఉద్యోగం ఇవ్వడం కుదరదని శశిధర్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

