Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకానినగర్ బ్రిడ్జి వద్ద మరో ప్రమాదం

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 09, 2026 12:42 PM విశాఖపట్నంGeneral
కాకానినగర్ బ్రిడ్జి వద్ద మరో ప్రమాదం - Udayam
గాజువాక-ఎన్ఏడీ మార్గంలోని కాకానినగర్ ఆర్వోబీ బ్రిడ్జి వద్ద ఓ లారీ హైట్ బ్యారియర్‌ను ఢీకొట్టడంతో బుధవారం ఉదయం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సరైన సూచిక బోర్డులు లేకపోవడంతో వాహనదారులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. పోలీసులు క్రేన్ సాయంతో లారీని తొలగించగా, గంటల తరబడి రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ప్రమాదాలు జరగకుండా అధికారులు వెంటనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...