వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమదాలవలసలోని అన్న క్యాంటీన్‌ను మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి క్యాంటీన్‌లో అందిస్తున్న ఆహారం నాణ్యత, రుచిపై ఆరా తీశారు.
పేద ప్రజలకు రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు.
క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో అధికారులు, క్యాంటీన్ నిర్వాహకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

