Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో ఆణివార ఆస్థానం

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 18, 2026 6:34 AM తిరుపతిGeneral
తిరుమలలో ఆణివార ఆస్థానం - Udayam
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థాన వేడుక శుక్రవారం శాస్త్రోక్తంగా జరిగింది. ఘంటా మండపంలో మలయప్ప స్వామి, ఉభయ దేవేరులను కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దజీయర్ సమక్షంలో పట్టువస్త్రాలు సమర్పించి, తాళపుచెవుల గుత్తిని స్వామివారి పాదాల చెంత ఉంచారు. సాయంత్రం స్వామివారు పుష్పపల్లకీపై మాడవీధుల్లో విహరించారు.

Comments

G
Loading comments...