వార్తలకు తిరిగి వెళ్లండి

మండపేటలో పుష్కరాల పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడం దారుణమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విమర్శించారు. పొలాలను లేఅవుట్లుగా మార్చే ఉద్దేశంతోనే అర్ధరాత్రి ఇళ్లను తొలగించారని ఆరోపించారు.
మూడు పుష్కరాలుగా అక్కడ నివసిస్తున్న వారిని తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. తాను అభివృద్ధిని అడ్డుకుంటున్నానన్న ఆరోపణలను ఖండిస్తూ, చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
Comments
Loading comments...

