వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం మున్సిపల్ ఛైర్మన్‌గా అందవరపు నరసింహవరం ఎనలేని సేవలు అందించారని రాష్ట్ర కళింగ వైశ్య సంఘం ఛైర్మన్ గోవిందరాజులు అన్నారు.
ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం మాజీ మున్సిపల్ ఛైర్మన్ పైడిశెట్టి జయంతి, కుటుంబ సభ్యులు, సంఘం నేతల ఆధ్వర్యంలో నిర్వహించారు. నరసింహవరం సేవలను స్మరించుకుంటూ వాటిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 16 మంది పేదలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు.
Comments
Loading comments...

