వార్తలకు తిరిగి వెళ్లండి

పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని అంబుసోలి గ్రామంలో ఏళ్లుగా నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారం లభించనుంది. రూ.16,18,365 అంచనా వ్యయంతో ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా మంచినీరు అందించే పనులు సోమవారం ప్రారంభమయ్యాయి.
స్థానికుల విజ్ఞప్తిపై ఎమ్మెల్యే గౌతు శిరీష స్పందించి అధికారులను ఆదేశించడంతో పనులకు శ్రీకారం చుట్టారు. దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

