వార్తలకు తిరిగి వెళ్లండి

సీతారామపురానికి చెందిన యోగిటీల పద్మకు మంగళవారం తెల్లవారుజామున పురిటి నొప్పులు రావడంతో 108కు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి తరలిస్తుండగా సంజీవరెడ్డినగర్ సమీపంలో నొప్పులు అధికమయ్యాయి.
దీంతో EMT గుజ్జుల వెంకట శ్రీనివాసులు అంబులెన్సులోనే ప్రసవం చేయించారు. పద్మ మగబిడ్డకు జన్మనివ్వగా, అనంతరం తల్లీబిడ్డను ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.
Comments
Loading comments...

