Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాళహస్తిలో అనంత్ అంబానీ పూజలు

Follow Udayam on Google
Rakesh Jun 12, 2026 3:04 PM చిత్తూరుGeneral
శ్రీకాళహస్తిలో అనంత్ అంబానీ పూజలు - Udayam
ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తి దేవస్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆలయ ఈవో వెంకటేశ్వర్లు ఘనంగా స్వాగతం పలికారు. అనంత్ అంబానీ ఆలయంలో రాహుకేతు పూజలు నిర్వహించి, స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వారికి స్వామి అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేసి ఆలయ మర్యాదలతో సత్కరించారు.

Comments

G
Loading comments...