Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో దుప్పుల కోసం ప్రత్యేక కేంద్రం

Follow Udayam Digital on Google
రేఖ దేవి Jul 28, 2026 2:13 PM నాగర్ కర్నూల్తెలంగాణ
అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో దుప్పుల కోసం ప్రత్యేక కేంద్రం - Udayam Digital
పెద్దపులుల ఆహార అవసరాలు తీర్చేందుకు అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో చుక్కల దుప్పుల సాఫ్ట్‌ రిలీజ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. మద్దిమడుగు రేంజ్‌లో రూ.1.95 కోట్లతో వంద ఎకరాల్లో ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేశారు. ఇక్కడ 200 దుప్పులను పెంచే సౌకర్యం కల్పించారు. వనస్థలి, నెహ్రూ జూపార్క్‌ల నుంచి 72 దుప్పులను తరలించారు. నీరు, పశుగ్రాసం, వైద్య సదుపాయాలతో పాటు భద్రత కోసం వాచ్‌టవర్‌ ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...