Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి ఛాంపియన్‌షిప్‌లో మెరిసిన కారంపూడి విద్యార్థిని

Follow Udayam on Google
T. SRINU BABU Sep 01, 2026 9:57 PM పల్నాడుGeneral
అమరావతి ఛాంపియన్‌షిప్‌లో మెరిసిన కారంపూడి విద్యార్థిని - Udayam
కారంపూడి మండలం పెద్దకొదమగుండ్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న లక్ష్మీదేవిశ్రీ అమరావతి ఛాంపియన్‌షిప్ క్రీడా పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచింది. అండర్-17 బాలికల వాలీబాల్ విభాగంలో పల్నాడు జిల్లా జట్టు తరఫున ఆడి, జట్టు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకోవడంలో ముఖ్యభూమిక పోషించింది. పతకం సాధించిన లక్ష్మీదేవిశ్రీని పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు.

Comments

G
Loading comments...