Udayam Digital
Menu

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు యువకుడి మృతి

Shruthi Nov 21, 2026 9:27 AM నల్గొండGeneral
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు యువకుడి మృతి - Udayam Digital
నల్గొండ జిల్లా మునుగోడుకు చెందిన సాయితేజ (25) అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన అతడికి వారం రోజుల క్రితమే ఉద్యోగం లభించింది. కారులో ప్రయాణిస్తుండగా రోడ్డుపై జింక అడ్డురావడంతో ప్రమాదం జరిగింది. జింకను ఢీకొన్న కారు ఆగిపోగా, వెనుక నుంచి వచ్చిన వాహనాలు ఢీకొట్టడంతో సాయితేజ తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతిచెందినట్లు ధ్రువీకరించారు.

Comments

G
Loading comments...