Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబులెన్స్ ఉంది.. డ్రైవర్ లేడు.

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 20, 2026 1:21 PM విశాఖపట్నంGeneral
అంబులెన్స్ ఉంది.. డ్రైవర్ లేడు. - Udayam
ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి కలెక్టర్ కొత్త అంబులెన్స్‌ను మంజూరు చేసినా, డ్రైవర్‌ను కేటాయించకపోవడంతో అది మూలనపడింది. మూడు నెలలుగా వాహనం నిరుపయోగంగా మారడంతో అత్యవసర పరిస్థితుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులు అనకాపల్లి, విశాఖ కేజీహెచ్‌లకు వెళ్లడానికి ప్రైవేటు అంబులెన్స్‌లను ఆశ్రయించి వేలకు వేలు చెల్లించాల్సి వస్తోంది. వెంటనే డ్రైవర్‌ను నియమించి వాహనాన్ని అందుబాటులోకి తీసుకురావాలి అని రోగులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...