వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో అమావాస్య సందర్భంగా చండీ హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ విశేష పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్త దంపతులు, తమ అభీష్ట సిద్ధి కోసం హోమగుండంలో ప్రత్యేక ఆహుతులను సమర్పించారు.
దేవస్థాన ఉప కమీషనర్ జే. ఏకాంబరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించి, ప్రసాదాలు అందజేశారు. గంగమ్మ తల్లిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
Comments
Loading comments...

