Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి ఛాంపియన్‌షిప్‌ పోటీల ప్రారంభం

Follow Udayam Digital on Google
అమరావతి ఛాంపియన్‌షిప్‌ పోటీల ప్రారంభం - Udayam Digital
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కైకలూరు వైవీఎన్నార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన అమరావతి ఛాంపియన్‌షిప్‌ నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి వాలీబాల్‌ ఆడారు. విద్యా వ్యవస్థలో ప్రభుత్వం పెనుమార్పులు తీసుకొస్తోందని, క్రీడలు ఆరోగ్యానికి దోహదపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల నిర్వహణ అభినందనీయమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...