అల్లు అర్జున్-బోయపాటి కాంబోలో మరో సినిమా?

అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శ్రీను మరోసారి కలిసి పనిచేయనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘సరైనోడు’ తర్వాత వీరి కాంబినేషన్‌లో రెండో సినిమా కోసం ప్రయత్నాలు మొదలైనట్లు సమాచారం.
ఈసారి బన్నీ కోసం బోయపాటి మైథాలజీ కథను సిద్ధం చేయగా.. స్క్రిప్ట్‌పై అల్లు అర్జున్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశముంది.
Comments
Loading comments...
