Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లిపూర్‌లో సైబర్ మోసంలో రూ.80,000 మాయమైంది

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 19, 2026 3:43 PM వికారాబాద్General
అల్లిపూర్‌లో సైబర్ మోసంలో రూ.80,000 మాయమైంది - Udayam
వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం అల్లిపూర్‌లో ఘరానా సైబర్ మోసం జరిగింది. వాట్సాప్‌కు వచ్చిన అనుమానాస్పద లింక్‌ను అల్లిపూర్ గ్రామానికి చెందిన బాధితుడు క్లిక్ చేయడంతో, క్షణాల్లో అతని బ్యాంక్ ఖాతా నుంచి రూ.80,000 మాయమయ్యాయి. మోసపోయానని గ్రహించి బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకులు ఓపెన్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Comments

G
Loading comments...