వార్తలకు తిరిగి వెళ్లండి

కోసిగి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఎంపికలో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు గోపాల్, పులిరాజు ఆరోపించారు. ఐదేళ్ల బోధనా అనుభవం ఉన్న స్థానికులను పక్కనపెట్టి స్థానికేతరులకు పోస్టులు కేటాయించారని ప్రిన్సిపల్ లక్ష్మీదేవిపై ఆరోపణలు చేశారు.
ఈ వ్యవహారంపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. అయితే జోనల్ పరిధిలోని ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపల్ తెలిపారు.
Comments
Loading comments...

