వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తిలో ప్రభుత్వానికి చెందిన విలువైన స్థలాలు, భవనాలు ఆక్రమణకు గురవుతున్నాయని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ అండతో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు.
పత్తికొండ రోడ్డులో సుమారు రూ.20 కోట్ల విలువైన స్థలాలు ఆక్రమణకు గురైనట్లు సమాచారం. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని గుత్తి పురపాలక కమిషనర్ జబ్బార్‌మియా తెలిపారు.
Comments
Loading comments...

