వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు పెరుగుతున్నాయంటూ ప్రజల్లో చర్చ జరుగుతోంది. టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనిఖీల పేరుతో హడావుడి చేసి మామూళ్లు వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
అనుమతి లేని భవనాలపై చర్యలు తీసుకోవడం లేదని, ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని వారు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

