Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం వాసన వస్తే నేరం కాదు

Follow Udayam on Google
రాజిత దేవి Jul 17, 2026 7:05 AM జాతీయంGeneral
మద్యం వాసన వస్తే నేరం కాదు - Udayam
శాస్త్రీయ ఆధారాలు లేకుండా కేవలం మద్యం వాసన వచ్చినంత మాత్రాన నిందితుడు తాగి వాహనం నడిపినట్లు భావించలేమని ఉత్తరాఖండ్ హైకోర్టు స్పష్టం చేసింది. రక్త, శ్వాస పరీక్షల ద్వారా మాత్రమే మద్యం పరిమితిని నిర్ధారించాలని పేర్కొంది. జీపు ప్రమాదం కేసులో నిందితుడు అమర్‌సింగ్‌కు వైద్యపరీక్షలు చేయకుండా బీఎన్‌ఎస్ సెక్షన్ 105 కింద మోపిన అభియోగాలను న్యాయస్థానం కొట్టివేసింది. ఇతర సెక్షన్ల కింద విచారణ కొనసాగుతుందని వెల్లడించింది.

Comments

G
Loading comments...